Norovirus: యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Norovirus: యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా వీటిని ‘‘ శీతాకాలపు వాంతుల క్రిమి’’ అని పిలుస్తారు. ఇది డయేరియాకు కారణమవుతుంది. క్రిస్మస్ ముందు నోరోవైరస్, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గురించి ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
నోరోవైరస్ అంటే ఏమిటి..?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నోరోవైరస్ అనేది అంటు వ్యాధి, ఇది వికారం, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది ఎక్కువగా కడుపు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ‘స్టమక్ ఫ్లూ’ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని కలుసుకుంటే వేరే వారికి కూడా ఈ నోరోవైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. నోరోవైరస్‌కి వ్యాక్సిన్ లేదు.
ఇది కడుపు, పేగుల వాపుకు కారణమవుతుంది. దీనిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. చాలా మంది ప్రజలు ఒకటి నుంచి మూడు రోజుల్లో ఈ వైరస్ బారి నుంచి కోలుకుంటారు. ఈ వైరస్‌కి ప్రత్యేకమైన మందులు లేవు. డీహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడంతో పాటు లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తుంటారు. వ్యక్తుల మలంలో కనీసం రెండు వారాల పాటు వైరస్ ఉంటుందని, చేతులను సబ్బులో శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!