యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు.
ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు.
యూకే నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
పదవిలో ఉన్నది 45 రోజులే అయినా బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్‌కు ఇకపై ఏటా రూ.కోటి రూపాయల అలవెన్స్ వస్తుందట. ప్రధానిగా పనిచేసేందుకు పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్(PDCA) పొందేందుకు అర్హత సాధించారు.
బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నికుంటారని ఆమె ప్రకటించడంతో తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమె ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరి చూపు తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై పడింది.
Former finance minister Rishi Sunak cemented his lead over rivals to become Britain's next prime minister on Thursday in an increasingly bitter race to replace Boris Johnson.