Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్‌లోనూ ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే యూకేకు ప్రధాని పీఠం రిషి సునాక్ ను వరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని రేసులో రిషి సునాక్ దూసుకుపోతున్నారు. తొలిరౌండ్‌లో సత్తా కనబరిచిన రిషి.. రెండో రౌండ్‌లోనూ ముందంజలో ఉన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం గురువారం జరిగిన రెండో రౌండ్‌లోనూ ఆయన అత్యధికంగా 101 ఓట్లు గెలుచుకున్నారు. దాంతో పాటు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. రెండో రౌండ్‌లో సునాక్ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్‌లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్.. రెండో రౌండ్‌లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ప్రధాని పదవి కోసం జరిగిన తొలి రౌండ్‌లో సత్తా కనబరిచారు రిషి సునాక్. అందరి కన్నా ఎక్కువగా ఎంపీల ఓట్లు సాధించారు. రిషి సునాక్ కు మొదటి రౌండ్‌లో 88 ఓట్లు సాధించగా.. పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లు, ట్రస్ లిజ్ 50 ఓట్లు సాధించారు. మొత్తం ఎనిమిది మందిలో ప్రస్తుతం ఆరుగురు రెండో రౌండ్‌లోకి రాగా రెండో రౌండ్‌లోనూ రిషి సునాక్ ఎక్కువ ఓట్లను పొందారు.
Booster Dose : రేపటి నుంచి ఉచితంగా బూస్టర్ డోసు..
యూకేలో జరిగిన రాజకీయ సంక్షోభంలో ముందుగా రాజీనామా చేసిన వ్యక్తుల్లో ఛాన్సలర్‌గా ఉన్న రిషి సునాక్ ఒకరు. ఆయన రాజీనామా తర్వాతే ఒక్కక్కరిగా కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 లోపు బోరిస్ జాన్సన్ వారసున్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!