తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుంచో డీఎంకేలో ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ ప్రస్తావన రావడంతో మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
Supreme Court Angry on Udhayanidhi Stalin Comments: సనాతన ధర్మం గురించి సినీ హీరో, డీఎంకే నేత – తమిళనాడు మంత్రి, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న స్టాలిన్ కామెంట్ల మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ…
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28…
Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సరికొత్త పొత్తు పొడవబోతోంది. అధికార డీఎంకే పార్టీతో కమల్ హాసన్‌కి చెందిన ‘మక్కల్ నీది మయ్యం’ పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పొత్తుపై ప్రకటన వెలువడుతుందని సోమవారం కమల్ హాసన్ తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
సౌత్ సినీ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కొలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019 లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీని ఎంపిక చేశారు.. అయితే ఈ సంఘం భవన నిర్మాణం కోసం గతంలో డబ్బులు కొరతగా ఉన్నట్లు హీరో…
ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి (OBC) చెందిన వ్యక్తి.. ఆయన చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు రాలేదని తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.