తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుంచో డీఎంకేలో ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ ప్రస్తావన రావడంతో మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని గంటల్లోనే ప్రకటన రావొచ్చంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఉయదనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై వచ్చే వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. అయినా ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం.. మీడియా వాళ్లు ఏ నిర్ణయం తీసుకోకూడదు.’’ అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Bharatiya Antariksh Station : 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం!
ఉదయనిధి ప్రస్తుతం తమిళనాడు కేబినెట్‌లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉదయనిధి.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆ వార్తలను ఉదయనిధి తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Bharatiya Antariksh Station : 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం!