Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను నియమించే అవకాశం ఉందని ఈరోజు (బుధవారం) డీఎంకే వర్గాలు తెలిపాయి. సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాబోయే 24 గంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ నెల ప్రారంభంలో ఎంకే స్టాలిన్ యూఎస్ పర్యటనకు ముందే ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎదగాలని సూచించాడు.
Read Also: Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.
కాగా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్నారు. ఇక, ముఖ్యమంత్రి విద్యను ఎంతగానో ఆదరిస్తారని.. స్కిల్ డెవలప్‌మెంట్ అనే శాఖ ఉంటేనే ప్రయోజనం.. ఇది మా ఉపముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది– క్షమించండి, మా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ని ఆగష్టు 19వ తేదీకి ముందు అలా పిలవలేము అని పేర్కొన్నారు. అయితే, క్రీడలు- యువజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖను కూడా ఉదయనిధి స్టాలిన్ నిర్వహిస్తున్నారు. చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 లాంటి కీలక ప్రాజెక్టుల అమలు తీరును ఆయన పరిశీలించి సమీక్షించారు.