Udhayanidhi Stalin: స్టార్ హీరోకు మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Angry on Udhayanidhi Stalin Comments: సనాతన ధర్మం గురించి సినీ హీరో, డీఎంకే నేత – తమిళనాడు మంత్రి, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న స్టాలిన్ కామెంట్ల మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. నిజానికి ఈ అంశం మీద పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Jayaprada: కోర్టులో లొంగిపోయిన జయప్రద
Also Read
దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ అంశం మీద తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉన్నా సరే మీ ఆ హక్కులు దుర్వినియోగం చేశారు, కానీ ఇప్పుడు మీరు రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో మీకు తెలియదా? అని సుప్రీం ప్రశ్నించింది. మీరేమీ సామాన్య వ్యక్తి కాదు కదా, ఓ మంత్రి పదవిలో ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడాలో సరిచూసుకోవాల్సిన అవసరం లేదా అని సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ తరువాత తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..