Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
Bulldozer action: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 తరగతి విద్యార్థి, తన సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడం నగరంలో ఉద్రిక్తలకు దారి తీసింది. దాడి చేసిన బాలుడు మైనారిటీ వర్గాని చెందడం, గాయపడిన బాలుడు మెజారిటీ వర్గానికి చెందడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.