ప్రముఖ ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లుగ్నెర్(91) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రెండు నెలల క్రితమే రిచర్డ్ ఆరో వివాహం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో లుగ్నర్ విజయవంతమైన వ్యవస్థాపకుడిగా పేరు గాంచారు.
జమ్మూ డివిజన్లో జరిగిన దాడుల్లో.. జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి అయ్యారు. ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల ముందే వైన్ షాపులకు టెండర్లను పిలిచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. 2023-25 సంవత్సరానికి గాను.. మరో రెండు మూడు రోజుల్లో వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని.. అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13085 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5182 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 82 లక్షలు. అయితే రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేశారు టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం ముసేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు…