ప్రముఖ ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లుగ్నెర్(91) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రెండు నెలల క్రితమే రిచర్డ్ ఆరో వివాహం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో లుగ్నర్ విజయవంతమైన వ్యవస్థాపకుడిగా పేరు గాంచారు. నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనుపరిచారు. అంతేకాకుండా సొగసైన జీవనశైలి కలిగి ఉన్నారు. అలాగే ప్రముఖ సెలబ్రిటీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇటీవలే రిచర్డ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.
వియన్నా ఒపెరా బాల్‌కు కిమ్ కర్దాషియాన్, పమేలా ఆండర్సన్ వంటి ప్రముఖులను తీసుకురావడంలో రిచర్డ్ పేరుగాంచారు. రెండు నెలల క్రితం సిమోన్ రైలాండర్(42)ను ఆరవ వివాహం చేసుకున్నారు. ఇదే తన చివరి పెళ్లి ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వియన్నాలోని తన విల్లాలో రిచర్డ్ మరణించారు. సిమోన్ రైలాండర్.. అత్యవసర సేవలను ఇంటికి రప్పించారు. అయినా కూడా అతనిని బ్రతికించలేకపోయాయి. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇంతక ముందు జరిగిన వివాహాల కారణంగా రిచర్డ్‌కు నలుగురు సంతానం ఉన్నారు. ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్.. రిచర్డ్ మృతికి సంతాపం తెలిపారు. ‘‘రిచర్డ్ లుగ్నర్ ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు మరియు అద్భుతమైన వ్యక్తిత్వం. తన దారిని ఎన్నడూ కోల్పోని ఆస్ట్రియన్ అసలైన వ్యక్తి. అతను శాంతితో విశ్రాంతి తీసుకో!’’ అని ఎక్స్ ట్విట్టర్‌లో రాశారు.
రిచర్డ్ లుగ్నర్ ఎవరు?
లుగ్నర్ విజయవంతమైన ఆస్ట్రియన్ వ్యవస్థాపకుడు. నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సొగసైన జీవనశైలితో పాటు సెలబ్రిటీల సంబంధాలతో ప్రసిద్ది చెందారు. ప్రముఖ అతిథుల్లో జోన్ కాలిన్స్, జేన్ ఫోండా, పమేలా ఆండర్సన్, కిమ్ కర్దాషియాన్, పారిస్ హిల్టన్ వంటివారు ఉన్నారు. రిచర్డ్ అత్యంత వారసత్వాలలో వియన్నాలోని ఐకానిక్ లుగ్నర్ సిటీ షాపింగ్ సెంటర్. దీనిని 1990లో నిర్మించారు. రిచర్డ్‌కు రాజకీయాలపైన కూడా మక్కువే. 1998లో ఒకసారి, 2016లో ఇంకోసారి ఆస్ట్రియన్ అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేశారు.
42 ఏళ్ల సిమోన్ రైలాండర్‌తో వివాహం జరిగిన రెండు నెలలకే మరణించడం బాధాకరం. గతంలో క్రిస్టీన్ గ్మీనర్ (1961-1978), కార్నెలియా లాఫెర్స్‌వీలర్ (1979-1983), సుసానే డైట్రిచ్ (1984-1989), క్రిస్టినా లుగ్నర్ (1990-2007), అలాగే ప్లేబాయ్ మోడల్ మరియు నటి కాథీ స్మిత్ (2014-2016) లను వివాహం చేసుకున్నారు.