Mumbai: ముంబయిలోని మల్వానీ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్‌లోని 15 అడుగుల లోతులో ముగ్గురు వ్యక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బరువుదెరువు కోసం వచ్చిన కొందరు ఒరిస్సాకు చెందిన కార్మికులు కలుషిత ఆహారం తిని బలయ్యారు. గౌరెడ్డి పేటలోని ఎమ్మెస్సార్ ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థత గురయ్యారు. దీంతో వెంటనే వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే చికిత్స పొందుతున్న 14 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి…
Cock fight: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. Read Also: Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్…
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. ఔటర్ రింగురోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. తాజాగా ఓ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగి వున్న లారీని ఢీ కొంది ఓట్రక్. దీంతో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్, తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వాహనదారులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక…