తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి (మం) నరశింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్‌లో జరిగింది.
Blast In Factory: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియాలోని ఎఫ్6 సెక్షన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో దాదాపు పది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఘటన తర్వాత గందరగోళ వాతావరణం నెలకొనగా, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఖమారియా ఆసుపత్రిలో చేర్చగా.. ఫ్యాక్టరీ యాజమాన్యం వారిని చూసుకొంటోంది. ఎఫ్-6 సెక్షన్‌లోని భవనం నంబర్ 200లో పేలుడు సంభవించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా…
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
జార్ఖండ్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి…
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు
యూపీలోని బిజ్నోర్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా బావ, మరదలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో.. కొంతకాలం క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాఖీ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. వరుసకు బావ అయ్యే డేవిడ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కుటుంబ…
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.