ఇద్దరిదీ విడదీయరాని స్నేహం.. వారి స్నేహాన్ని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. వారిద్దరినీ మృత్యువులోనూ విడదీయకుండా తిరిగి రానిలోకాలకు తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సదాశివ నగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కంటైనర్ ను ఓవర్ టెక్ చేయబోయి అదుపు తప్పి ఢీ కొట్టింది బైక్. దీంతో సతీష్, సిద్దార్థ్ రెడ్డి స్నేహితులు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: Nizamabad Accident: టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు మృతి
లారీని ఓవర్ టేక్ చేయబోయి లారీ అంచును బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. కామారెడ్డి నుండి ధర్మారావుపేట వెళ్తున్న ఇద్దరు యువకులు బండి నితీష్(20), అతని స్నేహితుడు సామల సిద్ధార్థ రెడ్డి(23) లు పల్సర్ బైక్ పై అతివేగంగా వెళుతూ కంటైనర్ వెనక నుండి ఎడమ నుండి ఓవర్ టేక్ చేయబోయి కార్నర్ లో ఢీ కొని బైక్ ఎగిరి పడిపోయింది.
ఈ ఘటనలో బండి నితీష్ అనే యువకుడు ఐదు మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాడు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కాగా బండి నితీష్ అనే యువకుడికి తల భాగంలో ఎక్కువగా గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి సామల సిద్ధార్థ రెడ్డికి తీవ్ర గాయాలు అవ్వడంతో అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి నుండి అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్ కు తరలిస్తు ఉండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. వీరిద్దరూ సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు ఒకేసారి చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Read Also: Nizamabad Accident: టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు మృతి