సమాజంలో దారుణాలు రోజూ మామూలైపోయాయి. ఎక్కడో చోట హత్యలు, అత్యాచారాలు మామూలైపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరి యువకుడు హత్యకు గురయ్యాడు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం పక్కనే నివాసం ఉండే యువకుడు గత రాత్రి హత్యకు గురయ్యాడు..వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రియుడు చిన్నాతో కలిసి భర్త వింజమూరి క్రాంతి కుమార్ (35 )ని హత్య చేయించింది భార్య.
ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు. భార్యను మరియు ఒక యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. భార్య గంగ లక్ష్మిని విచారిస్తున్నారు పోలీసులు..ప్రియుడు చిన్నా కోసం గాలిస్తున్నారు పోలీసులు.. ప్రియుడు.. ప్రియురాలి కోసం పచ్చని సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు.
తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఇద్దరికి సీరియస్ గా ఉంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. హైదరాబాదు నుంచి తిరుమలకు వస్తుండగా మామండూరు సమీపం దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొంది కారు. ఇద్దరు వ్యక్తులు అక్కడే మృతి చెందగా.. క్షత్రగాత్రులను రుయా హాస్పిటల్ కి తరలించారు. మృతులు నగేష్ (47) శ్రావణ్ కుమార్ (25.) క్షతగాత్రులు అపర్ణ, స్వాతి, సంజన,లక్ష్మి నారాయణ్, రాధికాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: Vande Bharat Ticket Rates: నేడే వందేభారత్ రైలు ప్రారంభం.. టికెట్ రేట్లు ఇవీ..