BCCI Changed Twitter Display Picture to Indian Flag For Independence Day 2023 Campaign: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తన ట్విటర్ ఖాతా డీపీ (డిస్‌ప్లే పిక్చర్)ని మార్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా బీసీసీఐ.. భారత జెండాను డీపీగా పెట్టుకుంది. దాంతో ట్విటర్ అధికారిక గుర్తింపు అయిన ‘గోల్డెన్ టిక్’ను బీసీసీఐ కోల్పోయింది. ఆదివారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు…
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.
భారతీయ మార్కెట్‌లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది.
Twitter Logo: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ట్విట్టర్ లోగోగా ఉన్న పిట్టను తొలగించి.. Xను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వెబ్‌సైట్‌ను కూడా X.com మార్చారు.
Twitter: ట్విట్టర్ నేటి నుండి క్రియేటర్ల కోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది. క్రియేటర్‌గా సంపాదించడానికి ఇంటర్నెట్‌లో X (X.com) అత్యుత్తమ ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.
జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం షరతులు పెట్టింది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక మెసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది.