Tomato Prices: టమాటా ధరలపై కూరగాయల విక్రేత కన్నీళ్లు.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetable vendor in tears over soaring tomato prices, Rahul Gandhi shares video: భారతీయ మార్కెట్‌లలో టమాటా ధరలు మండిపోతుండగా.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రయదారుడు కన్నీళ్లు పెట్టిన వీడియో సామాన్య ప్రజలను కూరగాయల ద్రవ్యోల్బణం ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో వెలుగులోకి తెచ్చింది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఉన్న విపరీతమైన టమాటా ధరలను భరించలేక కూరగాయల విక్రేత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసిన వారి హృదయాలను కదిలిస్తోంది.
టమాటాలు ధరలు చాలా పెరిగాయని, వాటిని కొనుక్కోవడానికి కూడా తన దగ్గర సరిపడా డబ్బులేదని కూరగాయల విక్రేత రామేశ్వర్ కంటనీరు పెడుతూ చెప్పాడు. జహంగీర్ పురిలో నివసించే కూరగాయల విక్రేత, తన రిటైల్ దుకాణం కోసం టమాటాలు కొనడానికి తన కొడుకుతో కలిసి మార్కెట్‌కు చేరుకుని అక్కడ ధరలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాము ఆ కూరగాయలు ఏ ధరకు అమ్మాలా కూడా మాకు తెలియదని, వర్షంలో తడిసినా, ఏదైనా జరిగినా తాము నష్టపోతామని ఆయన బాధపడ్డారు. ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన అన్నారు. కూరగాయలు ధరలు పెరగడం తనను నిరాశా నిస్పృహలకు గురి చేసిందని, రోజుకు రూ. 100-200 కూడా సంపాదించలేనని విక్రేత పేర్కొన్నాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చను సృష్టించింది. ఈ వీడియో చాలా మంది సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిని చూపిస్తోంది.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
Also Read: Bholaa Shankar: ‘భోళా శంకర్’లో ప్రధాన ఆకర్షణగా అన్నా చెల్లెళ్ళ బాండింగ్
వైరల్ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్నారని అన్నారు. “ఒకవైపు అధికారాన్ని కాపాడుకున్న శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు. వారి సూచనల మేరకు దేశ విధానాలు తయారు చేయబడుతున్నాయి. మరోవైపు సాధారణ భారతీయులకు కూరగాయలు వంటి ప్రాథమిక వస్తువులు కూడా అందకుండా పోతున్నాయి. ధనిక, పేదల మధ్య పెరుగుతున్న ఈ అంతరాన్ని మనం పూడ్చాలి. ఈ కన్నీళ్లను తుడవాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు.
देश को दो वर्गों में बांटा जा रहा है!
एक तरफ सत्ता संरक्षित ताकतवर लोग हैं जिनके इशारों पर देश की नीतियां बन रही हैं।
और दूसरी तरफ है आम हिंदुस्तानी, जिसकी पहुंच से सब्ज़ी जैसी बुनियादी चीज़ भी दूर होती जा रही है।
हमें अमीर-गरीब के बीच बढ़ती इस खाई को भर, इन आंसुओं को पोंछना… pic.twitter.com/zvJb0lZyyi
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2023
వీడియోను పంచుకున్న నటుడు
నటుడు విజయ్ వర్మ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పంచుకున్నారు. బాధిత కూరగాయల విక్రేతకు సహాయం అందించాలని ఉందన్నారు. ఆయన లాంటి చిన్న అమ్మకందారులకు సహాయం అందించడానికి ఏదైనా మార్గం ఉందో చెప్పాలని ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్లను అడిగారు. “ఇది హృదయ విదారకంగా ఉంది. అతనికి, అతనిలా జీవనోపాధిని కోల్పోయిన వారికి సహాయం చేసే మార్గం ఏదైనా ఉందా? ప్లీజ్ బతావో” అని నటుడు ట్వీట్ చేశారు.
This is heartbreaking. Is there any way one can help him and those who’ve lost livelihood like him? Pls batao https://t.co/Fq7rmIhjTV
— Vijay Varma (@MrVijayVarma) July 28, 2023
టమాటా ధర పెంపు
ఇటీవలి వారాల్లో 440 శాతానికి పైగా పెరిగిన టొమాటో ధరల పెరుగుదల, విక్రేతలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లోని అంగళ్లు హోల్‌సేల్ మార్కెట్‌లో, ఫస్ట్‌గ్రేడ్ టమాటా ధర శుక్రవారం 200 రూపాయలకు చేరుకుంది.
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!