Turkey Earthquake: టర్కీ దేశం భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతింది. టర్కీలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియా కూడా దెబ్బతింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్య 24 వేలను దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టపోయిన టర్కీకి ప్రపంచదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో…
Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం ఈ రెండు దేశాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి 25,000 మంది మరణించారు. శిథిలాలు తొలిగే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 1000 కన్నా ఎక్కవసార్లు భూమి కంపించింది. ఈ ప్రభావం వల్ల టర్కీ దక్షిణ ప్రాంతం, సిరియా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా 300 కిలోమీటర్ల పొడవుతో భూమి…
Earthquake: గుజరాత్ లోని సూరత్ నగరంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) వెల్లడించింది. సూరత్ కు పశ్చిమనైరుతికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని దీనివల్ల సూరత్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం సూరత్ జిల్లా హజీరా ప్రాంతంలోని అరేబియా సముద్రంలో 5.2 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం,…
Turkey Earthquake: టర్కీ భూకంపంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఫోటోలు ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. సహాయచర్యల కోసం చూడకుండా తమ వారిని రక్షించుకునేందుకు ప్రజలు పడుతున్న తాపత్రేయం హృదయవిదారకంగా ఉంటున్నాయి. శిథిలాల కింద పుట్టిన శిశువు, పట్టగానే అనాథగా మారిన సంఘటనలు సిరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.
Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
Turkey insults Pakistan: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ ను ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. పతనానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు తలొగ్గితేనే పాకిస్తాన్ కు అప్పు పుడుతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నాయకులు మాత్రం కొన్ని సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.