Turkey Teenager Who Drank Urine To Survive Is Rescued: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియాలలో భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో.. వేలాదిమంది ప్రజలు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. 100 గంటలకు పైగా సమయం గడిచినా.. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోయినా.. చాలామంది తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. ఆ నరకం నుంచి బయటపడి, ఎలాగైనా బతకాలన్నా సంకల్పంతో.. మృత్యువుతో పోరాడారు. అలాంటి మృత్యుంజయుల్లో అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు ఉన్నాడు. 101 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకున్న ఈ యువకుడు.. దాహానికి తట్టుకోలేక తన మూత్రానే తాగాడు. ఆ దుర్భర పరిస్థితిలో మరో దారి లేక, తన ప్రాణాల్ని నిలబెట్టుకోవడం కోసం ఆ పని చేశాడు. చివరికి తాను ఆశించినట్టుగానే ప్రాణాలతో బయటపడ్డాడు. బయటకొచ్చిన వెంటనే తన తల్లిని, కుటుంబీకుల్ని చూసి.. కంటతడి పెడుతూ ఒక్కసారిగా హత్తుకున్నాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం మూత్రం సేవించాల్సి వచ్చిందంటూ.. తన దయనీయ స్థితి గురించి వివరించాడు. ఇతనితో పాటు మరికొందరు మృత్యుంజయుల్ని బయటకు తీసిన సహాయక బృందాలు.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
Object Flying Shot Down: 40 వేల అడుగుల ఎత్తులో వస్తువు.. కూల్చేసిన యూఎస్ ఫైటర్ జెట్
అదియామన్ అనే మరో చోట.. 105 గంటల నుంచి శిథిలాల కింద చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారి సైతం ప్రాణాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఆ చిన్నారి వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆ చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటు.. కిరిఖాన్‌లో 50 గంటల తర్వాత ఓ మహిళను జర్మనీ బృందాలు రక్షించాయి. ఇంకో చోట ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల విద్యార్థిని మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ కాపాడింది. తూర్పు టర్కీలో శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. వాట్సప్‌లో తన స్నేహితులకు వీడియో సందేశం పంపించాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నాను? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను? అన్నది చెప్పాడు. దీంతో వెంటనే అతని స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, ఆ విద్యార్థిని కాపాడారు. మరికొన్ని చోట్ల అయితే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ చిన్నారి తన తమ్ముడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం గురించి అందరికీ తెలిసిందే! పాపం.. తనతో పాటు తమ్ముడ్ని కాపాడమని, కావాలంటే పని మనిషిగా సేవలు అందిస్తానంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు గుండె తరుక్కుపోయేలా చేశాయి. మరో దృశ్యంలో.. చనిపోయిన తన కూతురి చెయ్యిని తండ్రి పట్టుకున్న ఫోటో ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించేసింది.
Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..