Baby Born In Rubble of Syria Earthquake Is Named Aya Thousands Offer To Adopt: వరుసగా సంభవించిన భారీ భూకంపాల కారణంగా టర్కీ, సిరియా అతలాకుతలమైన సంగతి తెలిసిందే! వేలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. తెల్లవారుజామున భూకంపం రావడంతో.. వేలాదిమంది మృతిచెందారు. ఇంకా ఎందరో ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో.. హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అయితే.. ఈ ప్రకృతి విలయంలో ఒక అద్భుతం కూడా చోటు చేసుకుంది. కుప్పకూలిన ఓ భవనం కిందే.. ఈ భూమ్మీద్దకు ఒక చిన్నారి అడుగుపెట్టింది. ఆ చిన్నారి పేరే అయా. భూప్రళయంలో తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా.. వారి పాప ‘అయా’ కొత్త ఊపిరి పోసుకుంది. ఆ పసికందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. తనని దత్తత తీసుకునేందుకు వేలాదిమంది ముందుకు వస్తున్నారు.
Ashwini Vaishnaw: రైళ్లలో ఫస్ట్ ఎయిడ్‌పై విజయసాయిరెడ్డి ప్రశ్న.. జవాబిచ్చిన మంత్రి
సిరియాలోని జిండిరెస్ ప్రాంతంలో భూకంప తీవ్రతకు ఓ భవనం కూలిపోగా.. దాని కింద తన కుటుంబంతో పాటు ఓ నిండు గర్భిణి కూడా చిక్కుకుంది. భూకంప ధాటికి ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. శిథిలాల కింద చావు అంచుల్లోనూ ప్రసవ వేదని భరిస్తూ, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు విడిచింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే క్రమంలో.. సహాయక బృందాలకు ఓ పాప ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు వెంటనే సహాయక బృందాలు శిథిలాల్ని తొలగించి చూడగా.. బొడ్డుతాడుతో ఉన్న పసికందు వారికి కనిపించింది. దీంతో వాళ్లు ఆ పసికందును రక్షించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోలేని స్థితిలో, గాయాలతో ఆసుపత్రికి చేరిన ఆ పసికందుకు వైద్యులు చికిత్స అందించారు. ఇప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యస్థితి నిలకడగానే ఉంది. వైద్యం అందించిన వైద్యులే ఆ పసికందుకు ‘అయా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకి ‘అద్భుతం’ అని అర్థం. శిథిలాల కింద పుట్టడం ఒక అద్భుతం కాబట్టి.. ఆ అర్థం వచ్చేలా ‘అయా’ అనే పేరు పెట్టారు.
Doctor Uniform : ఆస్పత్రులకు అలా వస్తామంటే ఇక కుదరదు
చికిత్స అందిస్తున్న సమయంలో ఆ పాప గుక్కపెట్టి ఏడ్వడంతో.. ఓ వైద్యుడి భార్య ఆ శశవుకి పాలు పట్టి, మానవత్వం చాటుకున్నారు. అయా గురించి తెలుసుకున్న బంధువులు.. ఆ చిన్నారిని చూసుకునేందుకు ముందుకు వచ్చారు. ఈలోపే ఆ పాప స్టోరీతో పాటు ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. ఆ చిన్నారిని తాము దత్తత తీసుకుంటామంటూ వేలాదిమంది ముందుకొస్తున్నారు. ఇదిలావుండగా.. విపరీతంగా మంచం కురుస్తున్నా, వరుస ప్రకంపనలు వస్తున్నా, సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. మృతుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా టర్కీ, సిరియాలలో కలుపుకొని 21 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.