తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. క్యూ లైన్లలోకి వర్షపు నీరు చేరుతోంది. దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని అంజనాద్రిపై ఈ నెల 14వ తేదీ(నేటి) నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
Tirumala: నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో.. భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. భక్తులు సెల్ఫోన్లు, కెమెరాలు వంటి వాటితో శ్రీవారి సన్నిధిలోకి వెళ్లకుండా.. టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే, మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని మరీ.. శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం, ఆ దృశ్యాలు వెలుగుచూడటం వంటి వరుస పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా జరిగిన ఘటనతో తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి…
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు.. మెయిల్…
Tirumala: తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు కూడా ఎయిర్ఫోర్స్…
MLC Shaik Sabji: సీజన్, రోజుతో సంబంధం లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎప్పూడు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. అయితే, శ్రీవారిని త్వరగా దర్శించుకొని వెళ్లిపోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.. దానికోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి.. ఇక, తమకు ఉన్న పలుకుబడితో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా భక్తులకు దర్శనం చేయించిన సందర్భాలు లేకపోలేదు.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ కట్టడి చేస్తూనే ఉంటుంది.. తాజాగా, విజిలెన్స్ వలలో చిక్కారు ఉభయగోదావరి జిల్లాల…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం రానే వచ్చింది.. జులై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్లైన్లో పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం