Story Board: శ్రీవారి భక్తులకు సేవలందించడంతో పాటు.. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి అనేక ట్రస్ట్ లను ప్రారంభించింది.అందులో ప్రధానమైనవి.. అన్నప్రసాద ట్రస్ట్, ప్రాణదాన ట్రస్ట్, గోసంరక్షణ ట్రస్ట్,వేదపరిరక్షణ ట్రస్ట్. వీటిని ప్రారంభించి ముప్పైకి పైగా సంవత్సరాలు పూర్తి అవుతున్నా..ఒక్క అన్నప్రసాద ట్రస్ట్ కి మాత్రమే ఇప్పటి వరకు 1600 కోట్లు విరాళాలు అందాయి.మిగిలీన ట్రస్ట్ లకు ఇప్పటి వరకు అందిన విరాళాలు వంద కోట్ల రూపాయలకే పరిమితం.మరో వైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఇంకా…
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు.