TTD: కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. ఈ రోజు శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆగస్టుతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అదనపు కోటా టికెట్లను కూడా టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.. రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక, అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు అధికారులు.. ఇక, మరోవైపు.. రేపు తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించనున్నారు.. అంతేకాకుండా అక్టోబర్ నెలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.
Read Also: Urination Case: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన.. ఆగ్రాలో దారుణం.. వీడియో వైరల్
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. నిన్న శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.. ఈ నెల 10న శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత స్వామివారి హుండీకి రూ.5.11 కోట్ల ఆదాయం రాగా.. ఈ నెల 18న శ్రీవారి హుండీకి 5.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, సోమవారం రోజు హుండీ ఆదాయం రూ.5 కోట్లుగా పేర్కొంది టీటీడీ.