TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులు అప్రమత్తం అయ్యే సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యనుగ్రహ విశేష హోమాన్ని తలపెట్టింది టీటీడీ.. ఇందుకోసం కాసేపట్లో అంటే.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టికెట్లు విడుదల చేయనుంది. టికెట్ ధర ఇప్పటికే రూ. 1000గా నిర్ణయించింది టీటీడీ.. ఆన్‌లైన్‌లో మధ్యా్హ్నం 2 గంటలకు అందుబాటులో ఉంచనుంది.. ఇక, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.. ఈ నెల 23 నుండి అలిపిరి వద్దనున్న గోశాలలో శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించామని.. ప్రతి రోజు వంద టికెట్లను కేటాయిస్తాం.. ఆన్‌లైన్‌లో 50 టికెట్లు ఇస్తే.. ఆఫ్‌లైన్‌లో మరో 50 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. వెయ్యి రూపాయిలు ఇచ్చి హోమంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి దర్శన సౌకర్యం ఉండదు అని స్పష్టం చేశారు.
Read Also: Bandi Sanjay: పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
Also Read
ఇక, హోమంలో దంపతులు ఇద్దరూ మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని.. టికెట్ తీసుకున్నాం కదా అని.. కుటుంబ సభ్యులు మొత్తం వస్తే కుదరదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.. ఇక, బుధవారం రోజు శ్రీవారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు.. అందులో 26,689 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
Read Also: Bandi Sanjay: పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!