Dhanurmasam Special Sevas: ఇవాళ్టి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం అయింది. దీంతో నేటి రేపటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజులు పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది. ఇక, 19వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసింది. రేపు సిఫార్సు లేఖల స్వీకరణను సైతం రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొనింది.
అలాగే, తిరుమలలో ఈ నెల 22వ తేదీన ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకేన్లను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. రోజుకి 42500 చోప్పున పది రోజులకు 4.25 లక్షల టోకేన్లను ఇవ్వనుంది. అలాగే, ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో 10 రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఇక, నిన్నటి నుంచి తిరుపతి విమానశ్రయాంలో శ్రీవాణి దర్శన టిక్కేట్ల కౌంటర్ మూసివేశారు. శనివారం నాటి నుంచి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా విమాన ప్రయాణికులకు శ్రీవాణి దర్శన టిక్కేట్లు కేటాయిస్తున్నారు. రోజుకి 100 చోప్పున బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులకు టిక్కేట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు కేటాయిస్తుంది.