TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్లలో అధిక శాతం స్వామి వారి అన్నదాన ప్రసాద సముదాయంలో భోజనం చేస్తుంటారు. స్వామికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలపై వచ్చిన వడ్డీతో నిత్యాన్నదాన పథకం అమలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఆరోపణలు రావడంతో చర్చనీయాంశమైంది. 1985లో అన్నప్రసాద పథకాని ప్రారంభించింది టీటీడీ. అయితే, ఈ పథకానికి భక్తులు అందించే విరాళాలు పెరుగుతు వస్తున్నాయి. దీంతో అన్నదాన పథకాని మరింత విస్తరించింది టీటీడీ. మొదట్లో ఆలయం ఎదుట అన్నప్రసాద కాంప్లెక్స్ ఉండేది. ఇప్పుడు శ్రీవారి పుష్కరిణికి ఎదురుగా ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద సముదాయం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక పంక్తిలో నాలుగు వేల మంది భక్తులుకు అన్నప్రసాదం వడ్డించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
Read Also: Rajasthan : ‘భజన్ సర్కార్’ పట్టాభిషేకం.. రాజస్థాన్ కొత్త సీఎం నేడు ప్రమాణ స్వీకారం
అన్నప్రసాద కాంప్లెక్స్‌తో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయంలోనూ అన్న వితరణ జరుగుతోంది. తిరుపతిలోని శ్రీవారి వసతి సముదాయాలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తదితర ప్రాంతాల్లో నిత్యం అన్నదానం జరుగుతోంది. అన్నదానం కోసం ఉపయోగించే సరుకుల్ని టెండర్ల ద్వారా కొంటోంది టీటీడీ. అలాగే, నిత్యం 8 టన్నుల కూరగాయలను విరాళంగా అందిస్తున్నారు దాతలు. అన్నదాన పథకానికి ఏటా 150 కోట్ల రూపాయల వరకూ విరాళాలు అందజేస్తున్నారు భక్తులు. దీంతో ఈ పథకం కోసం బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు 1800 కోట్ల రూపాయలను దాటాయి.
Read Also: TDP vs YSRCP: నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు..
శ్రీవారి అన్న ప్రసాదంలో నాణ్యత లేదంటు ఇటీవల సోషల్ మీడియాలో కొందరు భక్తులు పెట్టి పోస్టు వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకూండా భక్తుల ప్రశంసలతో ముందుకు వెళ్తున్న ఈ పథకంపై ఒక్క సారిగా ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, అన్నదాన పథకంపై వాస్తవాలను పరిశీలించినప్పుడు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. కొంత మంది పనిగట్టుకుని శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారనే విషయం స్పష్టమైంది.
Read Also: TSRTC Zero Ticket: మహిళలు అలర్ట్.. బస్సు ఎక్కితే అది ఉండాల్సిందే..
తిరుమల శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అందుతున్న ఆహారం నాణ్యతను మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఏమైనా అసౌకర్యం కలుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యత బాగుందని… ఉద్యోగుల సేవలో ఎలాంటి లోపం లేదని చెప్పారు భక్తులు. మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న టీటీడీ అన్నప్రసాద పథకంలో ఎలాంటి లోపం లేదని తేలిపోయింది. అంతేకాదు.. భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా తమకు ఫిర్యాదు చేస్తే పరిష్కార మార్గాలను అన్వేషిస్తామంటున్నారు టీటీడీ అధికారులు. చిన్న చిన్న అంశాలపై గొడవ చేసి… శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం అటు భక్తుల నుంచి వ్యక్తమవుతోంది.