తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
TSPSC ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. పేపర్ లీకేజ్ కేసు రోజుకో ములుపు తిరుగుతుంది. TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితుల నాలుగో రోజు కస్టడీ విచారణ చేపట్టనుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్ లు వేస్తామని ఆయన అన్నారు.
TSPSC లో పేపర్ లీక్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో TSPSC ఆఫీస్ లో పోలీసుల సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు.
Tspsc పేపర్ లీక్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారి ఇది కాస్తా రాజకీయం పులుముకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరగడంతో తీవ్ర దుమారం రేపింది.