ABVP Protest: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా.. ఏబీవీపీ కార్యకర్తలు పలువరు పోలీసులను దాటుకుని రోడ్డు మీద పరుగులు తీశారు. దీంతో ప్రగలి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రగతి భవన్ గేటుకు సమీపంలో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతో పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Vikarabad Crime: లోన్ కోసం వెళితే.. తన పేరుపై 38 అకౌంట్లు..
ఈనేపథ్యంలో.. కొందరు ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ పోలీస్టేషన్ కు తరలించారు. కాగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి అయినా టీఎస్‌పీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ కార్యకర్తల నిరసనలతో ప్రతిభవన్ వద్ద వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Kota Srinivasa Rao: చేతులు జోడించి అడుగుతున్నా… నేను ఇంకా బ్రతికే ఉన్నాను