TSPSC: TSPSC ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. పేపర్ లీకేజ్ కేసు రోజుకో ములుపు తిరుగుతుంది. TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితుల నాలుగో రోజు కస్టడీ విచారణ చేపట్టనుంది. మరికాసేపట్లో హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ లో 9మంది నిందితుల విచారణ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ని ఎవరెవరికి ఇచ్చారనే విషయం పై ఆరా తీయనున్నారు. నలుగురు ఎన్అర్ఐ లు వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసారని గుర్తించిన అధికారులు వారిని ఫోన్ లోనే సిట్ విచారించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్ తీసుకున్నారు. ప్రవీణ్ కి తెలియకుండా రేణుక మరికొంత మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు అధికారులు. TSPSC పేపర్ తీసుకున్న వారిని గుర్తించి, వారిపైన కేసులు నమోదు చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి వెళ్లనున్నారు. సిస్టమ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ పై విచారణ చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ జరిగాయి అనేదానిపై సిట్ విచారణ చేయనుంది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సిట్ సోదాలు వ్యవహరించింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు విచారణ సాగుతుంది.
Read also: MLC Kavitha ED Live: ప్రముఖ అడ్వకేట్ తో కవిత సంప్రదింపులు
కాగా.. CD ఇంచార్జ్ శంకర్‌లక్ష్మీ డైరీ నుంచి కొట్టేశామన్నారు నిందితులు. అయితే, నిందితులు చెప్పేది అబద్ధమని సిట్ అంటోంది. అయితే.. ఐడీ, పాస్ వర్డ్ గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో రాజశేఖర్, ప్రవీణ్‌ను విడి విడిగా విచారించినట్లుగా సమాచారం. ఇక.. మరో నిందితురాలు రేణుక కోసమే ప్రవీణ్ ఏఈ పేపర్ లీక్ చేసాడనేది అబద్ధమంటోంది సిట్. అయితే.. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ అయినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రవీణ్ బంధువులు, స్నేహితుల్లో పోటీ పరీక్షలు రాసే వారికోసం ప్రవీణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలో.. డబ్బులు ఇస్తే పేపర్ లీక్ చేస్తానని అభ్యర్థులతో ప్రవీణ్ మాట్లాడినట్లుగా సిట్ సందేహం వ్యక్తం చేస్తూ.. అదే కోణంలో విచారణ చేస్తోంది. ఇక ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోమవారం సోదాలు చేసిన సిట్ పేపర్లకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
Read also: APSRTC CARGO: APSRTC మరో ముందడుగు.. ఇక డోర్ టు డోర్ కార్గో సేవలు
ఇది ఉండగా.. గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ను ఏకంగా ఉగాది పండుగ రోజే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. TSPSC పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రేవంత్ తనతో పాటు మంత్రి కేటీఆర్‌కు నోటీసులిస్తే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానంటు తెలిపారు. ఉగాది షడ్రుచుల పండుగ రోజు టీఎస్‌పీఎస్‌సీ ఎపిసోడ్ ఎంత హీటెక్కిస్తుందో వేచి చూడాలి. మరి ఇవాల సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించనుందో.. ఎవరెవరి పేర్లు ఇంకా బయటకు రానున్నాయో అనేదానిపై అందరిలో ఉత్కంఠ మారింది.
Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి