TSPSC : పేపర్ లీక్ లో నిందితుల ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇవాళ రెండో రోజున సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నజర్ పెట్టింది. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీయయ్యాయా అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Shocking: పెళ్లి చేసుకుని ఆరేళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు పరీక్షలను తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఫుడ్ సేప్టీ ఆఫీసర్, సీపీడీఓ, సూపర్ వైజర్ గ్రేడ్2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని సిట్ టీమ్ గుర్తించింది. మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ,డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది.
Also Read : Punjab: అస్సాంకు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను..భయానక వాతావరణం సృష్టించొద్దన్న సిక్కు సంస్థ
ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసుకున్నారని సిట్ టీమ్ గుర్తించింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ టీమ్ గుర్తించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన రేణుక కొందరికి ఈ పేపర్ ను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు గుర్తించారు.
- Tags
- Crime News
- police
- SIT
- telangana
- tspsc
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!