తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణలో అసలు ఏం జరగుతుందో తెలియడం లేదని ఆయన అన్నారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్ లు వేస్తామని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ విజయాలను ప్రభుత్వ విజయాలుగా చెప్పుకున్నప్పుడు.. టీఎస్పీఎస్సీ లో జరిగిన తప్పు ప్రభుత్వం తప్పు కాదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Also Read : Elephant Died: కరెంట్ కాటుకు మరో ఏనుగు బలి
మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకుంటారు.. కానీ అదే చెడు జరిగితే ఇతరుల ఖాతాలో వేస్తారా అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ బిల్ క్లింటన్ కంటే గొప్పొనినని చెప్పుకుంటారు.. పేపర్ లీక్ కాకుండా సాంకేతిక సమకూర్చాల్సిన బాధ్యత ఐటీ డిపార్ట్మెంట్ కు లేదా అని మంత్రి కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు.
Also Read : Minor Girl: అత్యాచారం.. ఛాతీపై బ్లేడుతో పేరు.. అబ్బా.. ఏమని చెప్పాలి వీడి ఆగడాలు
కరీంనగర్ లో బండి సంజయ్ అంటే ఎవరనే పరిస్థితిలో ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. నవీన్ ఆత్మహత్యపై బీజేపీ తమ స్టాండ్ ఎంటో ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ అడిగారు. కేంద్రం నుంచి ఏర్పాటు చేసే టెక్స్ టైల్ పార్క్ ను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలి.. రేపు అన్ని మండల కేంద్రాల్లో కేటీఆర్.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పుకుల ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మాజీ ఎంపీ పొన్నం అన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా తెలంగాణ సర్కార్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.