హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు.
నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ఏపీ పోలీసులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అంశాలు ఏమున్నాయంటే..
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. నిన్న రాత్రి ఏపీ పోలీసులు మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతుంది. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు.
పదేళ్ల క్రితం ఘటన గుర్తుకు వచ్చి కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి దూకి మరీ మహంకాళి ఏసీపీ రవీందర్ కు దండం పెట్టింది ఓ వృద్ధురాలు. వేగంగా పరిగెత్తుకుంటు రావడం చూసి బస్సులో ఏమైనా మరిచిపోయి ఉండి బస్సు కోసం పరుగున వెళ్తుంది అనుకున్నారు. కాని సదరు మహిళ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్ ను కలవడానికి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. Read…
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీస్థాయిలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, సొంత ప్రాంతాలకు ఎవరినీ బదిలీ చేయవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యారు. తీర్పును లంచ్ తర్వాత కోర్టు ఇవ్వనుంది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.