నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతుంది. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక విద్యుత్ తో కుడి కాల్వకు నీటిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారులు విడుదల చేసుకున్నారు. ఇక, 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో డెడ్ స్టోరేజ్ కు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేరుకోనుంది. దీంతో నాగార్జు సాగర్ డ్యామ్ దగ్గర మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు.