రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు.
ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదైంది. వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ కు విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్.పీ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాదిర్ అహ్మద్ (53), అతని పెద్ద కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (47) ఫారాహీనా పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు.
Marriage Cancel : కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. బంధువులంతా వచ్చారు. విందు భోజనాలు సిద్ధమయ్యాయి. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాలి.. ఉన్నట్లుండి మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన నిరసనల సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు 8ఏళ్ల క్రితం నాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 2,000 మంది ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి, కోచ్‌లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు రాళ్ల దాడులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా రాష్ట్ర పోలీసులు ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్…
రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ లైన్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ చుసిన ఆన్ లైన్ నేరగాళ్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ను అదునుగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఎక్కువగా యువతను టార్గెట్ గా చేసుకొని , అందినంత లాగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీస్కుంటున్నప్పటికీ , నగరంలో సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ అవడం వల్ల సైబర్ నేరాలను అదుపు చేయడం పెద్ద ఛాలెంజ్ లాగా మారింది. చిన్న వయస్సు…
రాష్ట్రంలో పేకాట క్లబ్బులను పూర్తిగా నిర్మూలిస్తామని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు మాత్రం పేకాట రాయుళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో పేకాట క్లబ్బులు మూతపడడంతో బడాబాబులు గ్రామాల్లో మామిడితోటల్లోని ఫామ్ హౌస్ లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. పేకాట మీద దాడులు చేస్తున్నట్టు నటిస్తున్న పోలీసు అధికారులు కూడాతృణమో పణమో తీసుకుని వదిలిపెడుతున్నారు. పేకాట స్థావరాల్లో దొరికిన భారీమొత్తాన్ని పోలీసులు నొక్కేశారన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆ…
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి అసలైన అర్థం చెబుతున్నారు సిరిసిల్ల పోలీసులు. ప్రజా చైతన్యానికి పోలీస్ నేస్తం అనే కార్యక్రమంతో ప్రజల ముంగిటనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చట్టపరమైన, ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో సరైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న జిల్లా పోలీసులు వినూత్నంగా…
పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్ కానుకగా రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని పెంచనున్నట్టు ప్రకటించింది. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హోం…