Police Awards : రేపు ఉత్తమ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది.
Also Read : Vivek Agnihotri: సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన “కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్..
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్‌లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్ మెడల్స్, ట్రైనింగ్ సమయంలో ప్రతిభ చూపించిన 11 మందికి హోంమంత్రి మెడల్స్, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకానికి ఏడుగురు పోలీస్ అధికారులు ఎన్నికయ్యారు.
Also Read : TS Congress : తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవా పతకం-2019లో 84 మందికి, ఆంత్రిక్ సురక్ష సేవా పతకం-2019 కింద 28 మందికి పతకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనున్నారు. ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీతో పాటు అడిషనల్ డీజీలు, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, ఒక ఎస్‌పీ, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, 22 మంది డీఎస్పీలు ఉన్నారు. వీరితో పాటు 39 మంది ఇన్‌స్పెక్టర్లు, 57 మంది ఎస్‌ఐలు, 31 మంది ఏఎస్‌ఐలు, 22 మంది హెడ్ కానిస్టేబుల్స్, 96 మంది కానిస్టేబుల్స్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. రవీంద్ర భారతీ ఆడిటోరియంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!