CM KCR: తెలంగాణను ఎగతాళి చేసిన వారికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ సాక్షాత్తు ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. బోధనా కాలేజీలే కాదు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చుకున్నాని తెలిపారు. 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు అదనంగా అందుబాటులోకి రానున్న దవాఖానతో విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని తెలిపారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి రోబోటిక్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్, ఎంఎన్‌జే డిస్పెన్సరీలకు విస్తరించింది. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. నిమ్స్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇటీవల రూ.156 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుండెకాయ లాంటి హైదరాబాద్ వాసుల వైద్య అవసరాలను తీర్చేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్ ఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. గాంధీలో సంతానోత్పత్తి కేంద్రం, అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గాంధీ, నిమ్స్, అల్వాల్‌లో సూపర్‌స్పెషాలిటీ ఎంసీహెచ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ను అధునాతన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.
Medak: చేతబడి అని అనుమానం.. చెట్టుకు కట్టేసి చితకొట్టిన గ్రామస్తులు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు