TS SIX Guarantees: ఆరు హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇంటిమ్మ ఇండ్లు అనే ఆరు హామీలను రానున్న వంద రోజుల్లో అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
Telangana Govt: ఆరు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఈరోజు (బుధవారం) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రవీంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు కార్యాలయం నుండి వెళ్తుండగా కొందరు డాక్టర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను హత్తుకుని డైరెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఉద్యోగులు, సిబ్బంది ఏడ్చారు. కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా పని చేశారు అంటూ శ్రీనివాసరావుతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. ఆయన గుర్తుగా డాక్టర్…
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను నియమించారు.
Maheshwar Reddy: ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్లు వుందని మండిపడ్డారు.
వచ్చే ఏడాది 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. 2024 సంవత్సరంలో సాధారణ సెలవులు 27, ఐచ్ఛిక సెలవులు 25 ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సర్కార్ సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌ట్రుమెంటల్ చట్టం…