TS EAPCET 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
TS EAMCET Results 2023: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు.
TS EAMCET : ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు.
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనివెల్లడించారు. MSET అగ్రికల్చర్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 10 నుండి 14 వరకు నిర్వహించబడతాయి.
ఎంసెట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది.
ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.…