TS Eamcet Counselling Second phase ends today
తెలంగాణ ఎంసెట్ రెండో దశ కౌన్సిలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభమైంది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీఎస్ ఎంసెట్- 2022 కౌన్సెలింగ్ ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ https://tseamcet.nic.in/ను సందర్శించడం ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే.. ఎంసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ఇప్పటికే పూర్తికాగా.. సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది.
Also Read :Etela Rajender : నేను చెప్పితేనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడు
అయితే.. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2022 రెండవ దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాల కోసం కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీ సంబంధిత కోర్సులలో 16,776 సీట్లతో సహా 22,820 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మంగళవారం కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, 3,374 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు బుధవారం చివరి తేదీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుధవారం షెడ్యూల్ చేయబడింది. వెబ్ ఆప్షన్‌లను బుధ,గురువారాల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే తాత్కాలిక సీట్ల కేటాయింపు అక్టోబర్ 16న ఉంటుందని అధికారులు తెలిపారు.