TS Eamcet results: నేడే ఎంసెట్ ఫలితాలు.. ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eamcet results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలను ఉదయం 9.45 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలలో మే 10 నుండి 14 వరకు నిర్వహించిన TS EAMCET 2023కి మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి రావడంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నారు.
Eamcet ఫలితం 2023 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
TS Eamcet ఎగ్జామ్స్ 2023లో హాజరైన అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్‌ని ఉపయోగించి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన తర్వాత, దీని కోసం అందించిన బాక్స్‌లో అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి. TS EMCET ఫలితాలు 2023 దాని ప్రకటన తర్వాత eamcet.tsche.ac.inలో తనిఖీ చేయవచ్చు.
మే 12 నుంచి 15 వరకు ఆరు బ్యాచ్‌లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల ఫలితాల ర్యాంకులు, మార్కులు విడుదల చేస్తారు.ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. EAMCET ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేయవచ్చు.
Sri Dattatreya Stotram: శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం వింటే సకల పాపాలు హరిస్తాయి
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
-
DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!