US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చార్కీ కిర్క్ వాదనలతో తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇక చార్లీ హత్య తర్వాత ట్రంప్.. దేశాన్ని ఏకం చేయడం కాకుండా.. దేశాన్ని విభజిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు.
జాతీయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. చార్లీ కిర్క్ను హత్య చేసిన నిందితుడు యాంటీఫాకు చెందిన వాడిగా ఎఫ్బీఐ అనుమానించింది.
ఖతార్లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మోలానియో బుధవారం, గురువారం లండన్లో పర్యటించనున్నారు. బుధవారం విండ్సర్ కోటలో కింగ్ చార్లెస్-3, క్వీన్ కెమెల్లా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక గురువారం ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు.
Dallas Incident: గత వారం డల్లాస్ మోటల్ ఘటనలో, ప్రవాస భారతీయులు, కర్ణాటకు చెందిన చంద్రనాగమల్లయ్య హత్య ఎన్ఆర్ఐలో భయాలను పెంచింది. అత్యంత దారుణంగా నిందితుడు నాగమల్లయ్య తల నరికి, శరీరం నుంచి వేరు చేసి, దానిని కాలితో తన్నిన వీడియోలు వైరల్గా మారాయి. నిందితుడిని 37 ఏళ్ల క్యూబాకు చెందిన వలసదారులు యార్డానిస్ కోబోస్ మార్టినేజ్గా గుర్తించారు. నాగమల్లయ్యను ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన, ప్రవాస భారతీయుల్లో భయాందోళనల్ని…
అంతర్జాతీయ జలాల్లో అమెరికా వెళ్తున్న వెనిజులా మాదకద్రవ్య నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.