ట్రంప్ హెచ్చరిక.. పన్నులను తొలగించే వరకు కెనడాతో చర్చలుండవ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పన్ను అమెజాన్, గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్ కంపెనీలను దెబ్బతీస్తుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో అన్ని వాణిజ్య చర్చలను వెంటనే ముగించినట్లు ప్రకటించారు, కెనడా డిజిటల్ సర్వీస్ టాక్స్‌ను “యునైటెడ్ స్టేట్స్‌పై ప్రత్యక్ష, స్పష్టమైన దాడి” అని అభివర్ణించారు. కెనడియన్ వస్తువులపై రాబోయే ఏడు రోజుల్లో కొత్త సుంకాలను ప్రకటిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. కెనడియన్ ప్రధాన మంత్రి మార్క్ కార్నీ దీనిపై ఇంకా స్పందించలేదు, కానీ ఆయన ప్రభుత్వం డిజిటల్ సేవా పన్ను విధించడాన్ని సమర్థించింది. ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమం నాశనం చేశామని అన్నారు. ఇరాన్ ఇకపై అణు బాంబును తయారు చేయలేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !
‘కన్నప్ప’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో మంచు విష్ణు, తన కెరీర్‌ను మరోసారి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు రెడి అయ్యారు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న ఆయన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక ఇసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లుగా విష్ణు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. విష్ణు తన తదుపరి సినిమాకు ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా దగ్గరైన ప్రభుదేవా, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ పెట్టబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం, పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. విశేషమేమిటంటే మంచు విష్ణు, ప్రభుదేవా కాంబినేషన్ టాలీవుడ్‌లోకి ఓ కొత్త ఎనర్జీని తెచ్చేలా కనిపిస్తోంది. కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా,యాక్టర్ గా కూడా తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకున్న ప్రభుదేవా మొత్తానికి చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి కంమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. మరి విష్ణుకు ఈ సినిమా మరో మేజర్ హిట్‌గా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నటీనటులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
మాదాపూర్ లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు..
మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను వద్ద హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సున్నం చెరువు పరిధిలో అక్రమంగా వెలిసిన గుడిసెలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించేస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా రూ. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు వెలుగుచూశాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగిస్తున్నారు. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం కొనసాగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా సూచించిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో దారుణం.. వర్షంలో ఆడొద్దని చెప్పినా మాట వినలేదని 10 ఏళ్ల కుమారుడిని చంపిన తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో దారణం జరిగింది. వర్షంలో ఆడుకోవడానికి పదేళ్ల కుమారుడు పట్టుబట్టడంతో కోపం తట్టుకోలేక తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. చెప్పిన మాట వినలేదని కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. దినసరి కూలీ అయిన రాయ్(40) సాగర్‌పూర్ రియాలో నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. మొత్తం నలుగురు సంతానం. నలుగురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నలుగురు బిడ్డల్లో మూడోవాడైన 10 పదేళ్ల బాలుడు శనివారం వర్షం పడుతుండగా ఆడుకునేందుకు బయటకు వెళ్లేందుకు పట్టుబట్టాడు. అందుకు తండ్రి అంగీకరించలేదు. అయినా కూడా కుమారుడు మారం చేశాడు. దీంతో కోపం తట్టుకోలేక వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకుని పిల్లవాడి పక్కటెముక వైపు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం సమీపంలోని దాదా దేవ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణ ప్రజల నిరీక్షణకు తెరపడింది.. ఎప్పటిలా కాకుండా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే పలకరించాయి, జూన్ చివరి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులతో స్వాగతం పలికాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు, బీడు భూములకు జీవం, నగరవాసులకు ఉపశమనం.. సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలయ్యే రుతుపవనాలు, ఈసారి కాస్త తొందరగానే తెలంగాణ గడ్డను తాకాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. దీని ప్రభావంతో, రాబోయే కొద్ది రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ముఖ్యంగా, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉంది.
నా భర్త నిర్దోషి, అమాయకుడు.. తెరపైకి నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాంకర్ స్వేచ్ఛ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ పరిచయమైందని స్వప్న పేర్కొంది. వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదని, వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని స్వప్న వివరించింది. అంతేకాకుండా.. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న పేర్కొంది. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసిందని స్వప్న ఆరోపించింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిందని, నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని భయపెట్టిందని స్వప్న చెప్పుకొచ్చింది. నా భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న వెల్లడించింది.
ఘోర ప్రమాదం.. టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదఘటన పై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుకు ఇరాన్ మతాధికారి ఫత్వా జారీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు. దేవుని శత్రువులైన ట్రంప్, నెతన్యాహు మాటలకు, వారి తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయాలని ముస్లింలను షిరాజీ కోరారు. నాయకుడిని బెదిరించే ఏ వ్యక్తైనా.. ప్రభుత్వమైనా అట్టివారిని మొహరేబ్(దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి)గా పరిగణిస్తారని షిరాజీ ఫత్వాలో పేర్కొన్నట్లు ఒక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్‌గా గుర్తించబడిన వ్యక్తులకు ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేధనం చేయడం లేదా బహిష్కరించబడతారని ఫ్యాక్స్ న్యూస్ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు.. శత్రువులకు ఏదైనా సహకారం, మద్దతు ఇవ్వడం నిషేధం ఉంటుంది. శత్రువులు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరం అని ఫత్వాలో పేర్కొన్నారు.
ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన భూగర్భ కేంద్రం ఫోర్డోపై అమెరికా ప్రయోగించిన బంకర్-బస్టర్ బాంబులు దూసుకుపోయాయని.. ప్రస్తుతం అక్కడ వేల టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాలను అనుసరించే స్థితిలో లేదని, కనీసం ప్రస్తుతానికైతే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌లో భాగంగా జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. భూగర్భ కేంద్రమైన ఫోర్డోపై మాత్రం ప్రత్యేకంగా దాడులు చేసినట్లుగా వివరించారు. ప్రస్తుతానికైతే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవన్నారు. కనీసం కొంత కాలం పాటు వరకైనా ఉండవచ్చి చెప్పారు. ఒకవేళ తిరిగి అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినా.. ఆ ఆలోచన వచ్చినా మరిన్ని దాడులు చేస్తామంటూ టెహ్రాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.