అగ్ర రాజ్యాధినేతలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లను చంపేస్తామంటూ అల్‌ఖైదా అధిపతి సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా హెచ్చరించాడు.
అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
అక్రమవలసదారులపై గత కొంతకాలంగా ట్రంప్ పరిపాలన ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా లాస్ఏంజిల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Trump New Bill: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్‌కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కూడా చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. దీనితో పాటు, మరో 7 దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ వంటి 12…
ఇరాన్లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకరయుద్ధం సాగుతోంది. 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఏకధాటిగా ఇరు పక్షాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.