న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు. గాజా సంక్షోభంపై టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, ఈజిప్ట్, యూఏఈ, జోర్డాన్‌లతో సహా ముస్లిం దేశాలు ఎంపిక చేసిన నాయకుల బృందంతో ట్రంప్ బహుపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇది అతి ముఖ్యమైన సమావేశం అని.. గాజాలో యుద్ధాన్ని త్వరలో ముగించడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం.. ట్రంప్ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలిపివేత
ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ ముగింపులో ట్రంప్‌ను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కలిశారు. అనధికారిక భేటీలో కొద్ది సేపు సంభాషించుకున్నారు. ఇరువురు షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకుని మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 25(గురువారం) వైట్‌హౌస్‌కు రావాలని పాక్ ప్రధాని షరీఫ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ట్రంప్ ఆహ్వానం మేరకు షరీఫ్ గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వండి.. హైకోర్టులో జగన్ మరో పిటిషన్..
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ట్రంప్, మెలానియా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఏమైంది? అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఇంకా చేసేదేమీలేక మెలానియా మెట్లపై నడుచుకుంటూనే పైకి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్ కూడా నడుచుకుంటూ పైకి వెళ్లిపోయారు. ఎస్కలేటర్ దిగగానే ట్రంప్ ఏమైందంటూ మరోసారి చేతి సైగలు చేశారు. అయితే ఈ పరిణామంపై వైట్‌హౌస్ సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
JUST IN 🚨 President Trump meets Pakistan PM Shehbaz Sharif at UN in New York
Reports indicate that Pakistan PM and U.S. President will hold a one-on-one bilateral meeting at the White House in Washington, D.C., on September 25, at the invitation of President Trump. pic.twitter.com/4W82hTeEkj
— Insider Paper (@TheInsiderPaper) September 24, 2025
NOW – Escalator at UN headquarters immediately stops as Trump and Melania step on it shortly after arriving. pic.twitter.com/8nlUkDoQxm
— Disclose.tv (@disclosetv) September 23, 2025