Trump Tariffs Hit AP Aqua Farmers: ఏపీలోని ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్ భారీగా పడనుంది. ముఖ్యంగా ఆక్వా రంగానికి కేరాఫ్‌గా ఉన్న పశ్చిమ గోదావరిలో తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడంతో.. ఆక్వా రంగం ఒడిదుడుకులకు గురవనుంది. రైతులపై 25 శాతం పన్ను భారం పడనుంది. ఇప్పటివరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా సుంకం ఉన్న విషయం తెలిసిందే. లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే..…
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశ రత్నాల, ఆభరణాల రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని సదరు రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయానికి ప్రధానంగా దోహదపడే ఈ రంగం ఇప్పటికే వివిధ ఆర్థిక ఒత్తిళ్లతో కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్ దెబ్బకు ఈ రంగం మరికొన్ని సవాళ్ళను ఎదురుకొనేలా కనపడుతోంది. ట్రంప్ భారత్…
Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్‌లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.
సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు సపోర్టుగా.. ఆ దేశంపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్టన్లు ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై తీవ్ర విమర్శలు చేశారు.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్‌తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసే ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుత 25 శాతం నుంచి సుంకం రేటును 50 శాతానికి పెంచారు. అమెరికన్ ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించడమే ఈ సుంకం లక్ష్యం అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్-ఇర్విన్ ప్లాంట్‌లో మాట్లాడుతూ, సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించి, అమెరికన్ తయారీని పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. Also Read:Operation Shield:…
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు ఆపడం లేదు. ఇటీవల, ఆపిల్ అధినేత టిమ్ కుక్‌తో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో, భారత్‌లో ప్లాంట్ నెలకొల్పవద్దని, అమెరికాలో పెట్టాలని కోరారు. "అతను భారతదేశం అంతటా ఫ్లాంట్లు నిర్మిస్తున్నాడు. మీరు భారతదేశంలో ఫ్లాంట్లు నిర్మించడం నాకు ఇష్టం లేదు." అని ట్రంప్ అన్నారు.
అధికారం చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలతో సంచలనంగా మారాడు. సుంకాల మోతతో వాణిజ్య రంగంతో పాటు ఇతర రంగాలు కుదేలై పోయాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై ట్రంప్ దృష్టిసారించారు. విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) ను అమెరికా వెలుపల…
Trump Tariff: చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్‌పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది.