Malreddy Ranga Reddy: మంచిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు.. దావూద్‌ను దాటేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి… ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.. తొలి రోజు 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రెండో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు మల్‌రెడ్డి… ఈడీ దర్యాప్తు చేస్తున్న ఇంటర్నేషనల్ డాన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్ ఇబ్రహీంని దాటి పోయారని వ్యాఖ్యానించారు.. ఇబ్రహీంపట్నంలో ఇందిరాగాంధీ పంచిన అసైన్డ్ భూముల మీద ఎమ్మెల్యే పడ్డారని విమర్శించిన ఆయన.. రైతుల దగ్గర నయీమ్ తో బెదిరించి భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. 2015 నుండి హవాలా కేసులు ఉన్నాయని ఈడీ అంది.. కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.. ఈయనకు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చింది.. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడేంత..? అని ప్రశ్నించారు.
Read Also: CM Jagan : ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో ఉపయోగం
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను బినామీగా ఆయన అనుచరుల దగ్గర పెట్టారని మంచిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు మల్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో బెదిరించి పొలాలను అమ్ముకుంటున్నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మీ ఎమ్మెల్యే చేసిన తప్పులకు మీకు సంబంధం లేకపోతే.. ఎమ్మెల్యేను పార్టీ నుండి, పదవి నుండి వెంటనే బహిష్కరించాలి.. 24 గంటల్లో పార్టీ నుండి బహిష్కరించపోతే ముఖ్యమంత్రి కూడా బాధ్యుడే అవుతారని విమర్శించారు.. ఫార్మా సీట్ లో 8632 ఎకరాల అసైన్డ్ భూమి లో 200 ఎకరాలు కొట్టేశారని విమర్శించిన ఆయన.. ఆరు నెలల క్రితం మాదాపూర్ లో మంచి రెడ్డి పట్టుపడితే వదిలేశారని.. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలెక్టర్ ని కొని ఎమ్మెల్యే గా డిక్లేర్ చేసుకున్నాడని.. ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడంటూ ఫైర్ అయ్యారు.. ఈడీ ఒక్కటే సరిపోదు.. సీబీఐ, ఆదాయపన్నుశాఖతో కూడా విచారణ చేయాలని సూచించారు మల్‌రెడ్డి రంగారెడ్డి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!