Big Breaking: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బీరంగూడలో టీఆర్‌ఎస్ కో-అప్షన్ మెంబెర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. శిఖామణి బంధువు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బంధువు భార్య, భర్త. మందలించిన విన భార్య వినలేదు. దీంతీ వీరిద్దరు కలిసే క్షణం కోసం ఎదురు చూసాడు భర్త. తన భార్యతో శికామణి ఉండగా భర్త రాజు వీడియో రికార్డు చేశాడు. మహిళతో ఉండగా వీడియో రికార్డు చేశాడని బెదిరింపులకు పాల్పడ్డ శిఖామణి.
నలుగురు వ్యక్తులను ఇంటికి పంపి రాజుని కిడ్నప్ చేయించాడు. రాజుని బెదిరించి వీడియో డిలీట్ చేయించాడు. తరువాత రాజును బెదిరించి ఈవిషయం బయటకురాకూడదని హెచ్చరించాడు. తరువాత నలుగురు వ్యక్తులు రాజుని వదిలేసారు. అక్కడినుంచి వచ్చిన రాజు అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే.. టీఆర్ఎస్ నేతలు వరసగా వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. మరి వీటిపై పార్టీ వర్గాల్లో ఎలా స్పందిస్తారో ? వేచి చూడాలి.
టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కళ్యాణి లక్ష్మీ రాలేదన్న యువకుడినిపై ఎమ్మెల్యే మదసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన యువకుడ్ని లోపలై అంటూ పోలీసులకు ఆర్డర్ చేశారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. దళిత బందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతుండగా సభకు హాజరైన అక్కడున్న మహిళలు తమకు దళిత బంధు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి అందరికి వస్తుంది ఓపిక పట్టాలన్నారు. ఆవిధంగా అనుకుంటే కొంతమందికి దళిత బంధు వచ్చింది.. దాదాపుగా కోటి యాభైలక్షలు మంజూరు చేసామని గుర్తు చేశారు. మీకు ఓపిక లేకుంటే మేమేం చేస్తాం అన్నారు మంత్రి. బీజేపీ వాల్లతో తిరుగుతున్న వారు వాళ్లనే అడిగి తీసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మాకు ప్రశ్నించడం ఏంటి అందరికి వస్తుంది.. ఓపికలేని వాళ్లకు మమేం చేయలేం.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో.. బీరంగూడలో టీఆర్‌ఎస్ కో-అప్షన్ మెంబెర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Gautam Adani: మళ్లీ మూడో స్థానానికి పడిపోయిన అదానీ.. కారణం ఇదే..