రాష్ట్రంలో రాజకీయం రగడ రాజుకుంటోంది. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే నేడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడి కార్యకర్తలను బీజేపీలో చేరకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అంతేకాకుండా.. మెదక్ జిల్లా అంటే కేసీఆర్ జిల్లా, టీఆర్‌ఎస్ జిల్లా అని అంటారు.. కానీ ఇప్పుడు ఎగిరేది కాషాయ జెండా.. దమ్ముంటే మాతో కొట్లాడండి..కానీ దొంగతనంగా రావద్దు. దుబ్బాక ఎలక్షన్ తో కేసీఆర్ కి, అల్లుడు హరీష్ రావుకి, కొడుకు కేటీఆర్ కి చెంప చెల్లుమన్నది.. హుజురాబాద్ లో నన్ను ఓడించాలని చూశారు.. నన్ను బర్తరఫ్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టారు.. ఆత్మగౌరవంతో పోరాడిన..గెలిచిన.. అసెంబ్లీలో నన్ను ఎదిరించే సత్తా లేక రెండు సార్లు నన్ను బయటికి పంపారు..
కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది కేవలం ఆబ్కారీ శాఖ మాత్రం.. 10 వేలు ఉన్న ఆబ్కారీ ఆదాయాన్ని 45 కోట్లకు పెంచిండు.. ఆడబిడ్డల పుస్తెలు తెంపిన చరిత్ర కేసీఆర్ ది.. పుస్తె కట్టడానికి కళ్యాణాలక్ష్మి ఇస్తున్నావు.. పుస్తె తెంపడనికి వైన్స్ పెట్టింది.. ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రాడు.. మునుగోడు గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే.. కేసీఆర్ అహంకారాన్ని బద్దలుకొట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం. కౌలు రైతులకు కూడా మేం రైతు బంధు సహాయము చేస్తాం.. కేసీఆర్ కంటే 100 రేట్లు గొప్పగా పాలించేది బీజేపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.