భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్.. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చివరకు ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దలను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. మళ్లీ విమానంఎక్కి హస్తినకు వెళ్లి కాషాయ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టిన ఆయన.. తన వెంటన వచ్చిన టీఆర్ఎస్…
తన సంస్థలు, ఇల్లు పై ఈడీ రైడ్స్, నోటీసులు జారీ చేసిన విషయంపై టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు ఎట్టకేలకు స్పందించారు. నా బలం కేసీఆర్… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు నామా.నేను ఎప్పడు జీవితంలో నీతి…నిజాయితీతో ఉంటున్నానని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. 40 ఏళ్ళ క్రితమే మధుకన్ ను స్థాపించానని… రాత్రిపగలు కష్టపడ్డానని వెల్లడించారు. మధుకన్ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసిందని.. ఏ…
టీఆర్‌ఎస్‌లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా? కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా? తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ…
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్ మండలం భీంపెల్లిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని నిలదీశారు గ్రామస్థులు. డబుల్ బెడ్ రూమ్, పించన్, దళితులకు మూడెకరాల భూమి ఎదని నిలదీశారు భీంపెల్లి గ్రామస్థులు. రైతులకు రైతుబందు, భీమా ఇచ్చి ఏ భూమి లేని పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ఇచ్చిందని నిలదీశారు పేదలు. ఇక్కడే కాదు గ్రామ, గ్రామాన టిఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నారు గ్రామస్థులు. అయితే గ్రామస్థులు నిలదీస్తున్న విజువల్స్ చిత్రీకరించే పాత్రికేయులపై…
హుజూరాబాద్ ప్రజలంతా ఈటల రాజేందర్‌కు గోడి కట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని వెల్లడించారు.. అయితే, వాపును చూసి ఈటల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈటల చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రైతు బంధుకు చెక్ తీసుకుని…
ఈటల రాజేందర్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈటల రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ పైన వరుస విమర్శలు చేస్తున్నారు ఈటల. అధికార తెరాస అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఇక ప్రగతి భావం లో ఇచ్చిన స్రిప్ట్ చదివే మంత్రులు తమ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలన్నారు. అయితే ఈటల పై తెరాస నాయకులూ కూడా విమర్శల వర్షం గుపిస్తున్నారు. కానీ హుజురాబాద్ లో రానున్న ఉప…
తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నికలు జరగనుండడంతో.. నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి.. ఇంటికి వెళ్లి అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇదే సమయంలో.. మరికొంతమంది నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. పనిలో పనిగా.. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్ సభ…
మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని..తెలంగాణకు, సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో రహదారులు అభివృద్ధి జరుగుతు న్నాయని..తెలంగాణ వచ్చాక సిరిసిల్ల వాటర్ జంక్షన్ గా మారిందన్నారు. తెలంగాణకు గుండె కాయ మిడ్ మానేరు ప్రాజెక్టు అని..త్వరలో సిరిసిల్లకు రైల్వే లైన్ వస్తుందని పేర్కొన్నారు. మిడ్ మానేరు…
ఈటల రాజేందర్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సెక్రెటరీ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరారని… జార్జిరెడ్డి కమ్యూనిస్టు భావజాలం గల మీరు బిజెపిలో ఎలా చేరతారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఏడున్నర సంవత్సరాల ముదురాజ్ బిడ్డలకు ఉద్యోగ కల్పన కల్పించారా? బిసి నాయకులుగా ఉన్న మీరు వారికి ఎం చేశారని నిలదీశారు. కౌశిక్ రెడ్డిని ఓడించుటకు బిసి నాయకులకు బ్యాంక్ లోన్ కల్పిస్తామన్న మీరు ఎంత మందికి కల్పించారని……
త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గం మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో ఓపిక పట్టిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్ళు తాగు, సాగు నీరు ఇచ్చారా? అని…