ఈటలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరూ ఒక్క గింజ కొనలేదని, కానీ మన రాష్ట్రంలో తడిసిన, మొలకెత్తిన, తాలు ఉన్న, 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను కొని రైతాంగాన్ని ఆదుకున్నామని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం ఈటల రాజేందర్ బిజేపిపై విమర్శలు చేశారని గుర్తు లేదా ? అని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చారని, రైతులపై కాల్పులు జరుపుతున్నారని ఈటల వ్యాఖ్యనించారని..నాడు దెయ్యాలుగా కనిపించిన బిజేపి.. నేడు దేవుడులా మరిందా అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ భూములతో పాటు దేవాదాయ భూములను ఏ విధంగా కొంటావని ఫైర్ అయ్యారు. పదే పదే నేను కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లాలని ఈటల రాజేందర్ చెబుతున్నాడని..కానీ అది తన స్వార్థం ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్లాడని చురకలు అంటించారు. ఈటలకు ఎమ్మెల్యే టికెట్ కానీ, మంత్రి పదవి కానీ ఇచ్చింది కెసిఆర్ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈటలకు టికెట్ ఇస్తేనే ప్రజలు ఓట్లు వేశారని గుర్తుంచుకుంటే మంచిదని చురకలు అంటించారు.