గజ్వేల్ లో సిఎం కేసిఆర్ కాలు పెట్టడం చాలా అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని..గజ్వేల్ ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు. కసికడు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి సాగు, త్రాగునీటి కష్టాలను సిఎం కేసిఆర్ దూరం చేశారని కొనియాడారు. తెలంగాణ సాగు, త్రాగు బాధలు తీర్చిన ఘనత సీఎం కేసిఆర్ దేనని.. గజ్వేల్ సమీకృత మార్కెట్ దేశానికే నమూనాగా నిలిచిందన్నారు. విదేశీ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు గజ్వేల్ అభివృద్థిని అధ్యయనం చేసేందుకు వస్తున్నారని..రూ. 500 కోట్లతో గజ్వేల్ మాదిరి అన్ని మున్సిపాలిటీ లలో సమీకృత మార్కెట్ ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.